నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ చిత్రం

0

nani

‘చిన్నోడు పెద్దోడు’తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ కొంత విరామం తర్వాత ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని హీరోగా విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఈ చిత్రవిశేషాలను శివలెంక కృష్ణప్రసాద్ తెలియజేస్తూ – ”ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన షెడ్యూల్ తో 40 శాతం పూర్తయ్యింది. ఈ నెల 22 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపే షెడ్యూల్ లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుంది.  టైటిల్ ను త్వరలో ప్రకటిస్తాం. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.
అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, ‘సత్యం’ రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, కృష్ణకాంత్, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: యోగానంద్, నిర్మాణ నిర్వహణ: పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts