నాటి ప్రేయసి తనకి నేడు వదిన అయింది

0

Moushmi Chatterjeeఎక్కడలేని చిత్రవిచిత్రాలన్నీ సినిమా రంగంలోనే అవుతుంటాయి. ఉదాహరణకి : శ్రీదేవి చిన్నప్పుడు ఎత్తుకుని నటించిన ఎన్టీఆర్, ఆ తరువాతి కాలంలో తన పక్కన హీరోయిన్‌గా నిలబెట్టి సినిమాలు తీశాడు. అటు హిందీలో సల్మాన్ ఖాన్ సినిమాలకి చిన్నపిల్లలా తన అక్కా కరిష్మా కపూర్‌తో షూటింగులకి హాజరయిన కరీనా ఆ తరువాత సల్మాన్‌తో సినిమాలు చేయడం.. ఇలా చాలా జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా, ఒకప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సరసన ప్రేయసిగా మెరిసిన అలనాటి అందాల తార మౌసమీ ఛటర్జీ, ప్రస్తుతం ఒక సినిమాలో అమితాబ్ కి వదినగా కనిపించనుంది. ఆ వివరాలేమిటో ఒకసారి చూద్దాం.

ఒకప్పుడు హిందీ రంగాన్ని ఉర్రూతలూగించిన తారల్లో మౌసమీ చటర్జీ ఒకరు. చక్కని రూపానికి మంచి అభినయం తోడవ్వడంతో మౌసమీ పదేళ్లకు పైగా హిందీ తెరను ఓ స్థాయిలో ఏలారు. హిందీలో చేసిన తొలి చిత్రం ‘అనురాగ్’లో అంధురాలిగా నటించి, శభాష్ అనిపించుకున్నారామె. ఆ తర్వాత అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చాలానే చేశారు. కథానాయికగా ఓ పదిహేనేళ్లు చేసిన తర్వాత, సహాయ పాత్రలు చేయడం మొదలుపెట్టారు మౌసమీ.

ఈ మధ్య అడపా దడపా మాత్రమే నటిస్తున్నారామె. ఈ నేపథ్యంలో ‘పీకు’ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారని సమాచారం. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇర్ఫాన్‌ఖాన్ ముఖ్యతారలు కాగా, ఇటీవలే మౌసమీని ఎంపిక చేశారు. ఇందులో అమితాబ్‌కి వదినగా నటించనున్నారామె. అమితాబ్ బచ్చన్ సరసన ‘బేనామ్’, ‘మంజిల్’ తదితర చిత్రాల్లో నటించారు మౌసమీ. ఒకప్పుడు బిగ్ బీ సరసన ప్రేయసిగా నటించి, ఇప్పుడు ఆయనకు వదినగా చేయడం అంటే విశేషమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts