నాకు ఆడ తోడు అక్కర్లేదు : ప్రభుదేవా

0

Prabhu-Deva

మరి మగతోడు కావాలా అసహ్యంగా అంటూ అలా లేనిపోని ప్రశ్నలు మీ బుర్రల్లోకి రానీయకండి. ఇంతకీ ప్రభుదేవా అలా ఎందుకు అన్నాడు అని తెలుసుకోవాలి అంటే ఇది చదవండి. నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా ఆడతోడు అవసరం లేదంటున్నారు. ఈయన రామలత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ముగ్గు రు పిల్లలకు తండ్రి అయిన తరువాత భార్యతో మనస్పర్థల కారణంగా ఆమెకు విడాకులిచ్చారు. ఆ తర్వాత నటి నయనతారతో ప్రేమాయణం సాగించారు. అది పెళ్లి వరకు వెళ్లింది. ఆ తరువాత రూటు మారిన విషయం తెలిసిందే. అలాంటి ప్రభుదేవా ప్రస్తుతం ఆడతోడు అవసరం లేదనడం గమనార్హం. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్‌లో టాప్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు.

ఈయన దర్శకత్వం వహించిన రౌడీ రాథోర్, వాంటెడ్ వంటి చిత్రాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరోలతోపాటు హీరోయిన్లు ప్రభుదేవా దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుదేవాను కొందరు బాలీవుడ్ హీరోయిన్లతో ముడి వేసిన పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని ప్రభుదేవా ఇప్పుడు అవన్ని వదంతులేనంటూ కొట్టిపారేశారు. దీనిగురించి ఆయన స్పందిస్తూ ఇప్పుడు స్త్రీలంటేనే తనకు అయిష్టత కలుగుతోందన్నారు. బాలీవుడ్ నటీమణులతో ప్రేమ, పెళ్లికి సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అంతా అసత్యమన్నారు. నిజం చెప్పాలంటే తనకు ఆడ తోడే అవసరం లేదని వెల్లడించారు. ఇంత విరక్తికి కారణం నటి నయనతారతో ప్రేమ విఫలమేనా?..

లేక, ప్రభు “చల్లబడిపోయాడా? లేక ఇక చాల్లే అనుకున్నాడా? రెండవదే అయి ఉంటుందిలెండి. ఎందుకనేట్ సినిమాకో తోడు హీరోయిన్ రూపంలో దొరుకుతున్నప్పుడు ప్రత్యేకించి ఏ తోడు కోరుకుంటాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts