నయనతార ఒప్పుకోలేదని నిద్రమాత్రలు మింగేశాడట

0

Udhayanidhi-Karaikudi-Nayantaraఅయ్యో అవునా….ఇప్పుడు ప్రభుదేవాకి ఏమైంది?
ప్రభుదేవా గురించి ఎవరేం చెప్పారిప్పుడు మీకు?
ఓహ్ …..అయితే శింభూ ఎలా ఉన్నాడు మరి?
శింభూ గురించి ఎవరైనా ఏదైనా చెప్పారా ఇప్పుడు?

మరి వాళ్ళిద్దరూ కాకపోతే,ఇంకెవరు నయనతార కోసం అంతటి దుశ్చర్యకి తెగించింది అని ఆశ్చర్యపోతున్నారా? విషయం తెలిస్తే ఔరా అనుకుంటారు. ఈ సంఘట గురించిన పూర్తి వివరాలు మీరే చదవండి.

నయనతార అందచందాలకు ఆకర్షితులు కానివారుండరు. కానీ, నయనతార మాత్రం ఇప్పటివరకు శింబు, ప్రభుదేవాకి మాత్రమే ఆకర్షితురాలైంది. ఈ ఇద్దర్నీ ఘాటుగా ప్రేమించి, చాలా సులువుగా విడిపోయింది. ఇప్పుడు సోలో లైఫ్ గడుపుతోందని ఊహిస్తే తప్పేనట. ఎందుకంటే, యువనటుడు గణేష్ వెంకట్రామన్ తో నయనతార ప్రేమాయణం సాగిస్తోందనే వార్త ప్రచారంలో ఉంది. ఆ సంగతి అలా ఉంచితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మనవడు, నిర్మాత, హీరో ఉదయనిధి స్టాలిన్, నయనతార వ్యవహారం గురించి ప్రస్తుతం ఓ హాట్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే..

ఉదయనిధి హీరోగా నటించి, నిర్మించిన ‘ఇదు కదిర్ వేలన్ కాదలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి అతనితో జతకట్టింది నయనతార. ఆ తర్వాత ఉదయనిధి సరసన ‘నన్బేన్డా’ అనే చిత్రం అంగీకరించింది. ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని నెలలుగా నిరవధికంగా జరుగుతోంది. కాగా, నయనతారపై ఉదయనిధి మనసు పారేసుకున్నాడని చెన్నయ్ టాక్. ఇటీవల తన ప్రేమను ఆమె దగ్గర వ్యక్తపరిచాడని, కానీ నయన ఒప్పుకోలేదని భోగట్టా. ఆ బాధ తట్టుకోలేక ఉదయనిధి నిద్ర మాత్రలు మింగాడని సమచారం. సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రమాదం తప్పిందట.

ఇదిలా ఉంటే ఉదయనిధి కి ఆల్రెడీ పెళ్లయ్యింది. అతని భార్య కృతిక ప్రస్తుతం ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఉదయనిధి, కృతికల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, వీరి కాపురం సజావుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. నయనతార కోసం ఉదయనిధి నిద్ర మాత్రలు మింగి ఉంటాడనే వార్తలో నిజం ఉండకపోవచ్చని అని కూడా అంటున్నారు.

పెళ్లాంతో ఏ గొడవా లేనప్పుడూ, ప్రియురాలు దేనికి సామీ నీకు…..?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్క...
Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
powered by RelatedPosts