నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా నారా రోహిత్ ‘సావిత్రి’ ఆడియో రిలీజ్

0

నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా నారా రోహిత్ ‘సావిత్రి’ ఆడియో రిలీజ్

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. ప్రతి స్క్రిప్ట్ ను విలక్షణంగా ఎంచుకుంటూ ఇటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో నారారోహిత్ హీరోగా నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి’. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ కు దగ్గరైన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 4న నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా…

చిత్ర నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’మా క్యూట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సావిత్రి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. రోహిత్ పెర్ఫార్మన్స్ లో,బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎక్సలెంట్ పెర్ ఫార్మెన్స్ చేశారు. అలాగే రీసెంట్ గా నారా రోహిత్ పాడిన సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 4న నిర్వహించనున్నాం. ఈ వేడుకకు నటసింహ నందమూరి బాలకృష్ణగారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఘనంగా జరగనున్న ఈ ఆడియో వేడుకకు పలువురు సినీ ప్రముఖులు రానున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం” అన్నారు.

నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు

సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ – వస్సంత్ , డైలాగ్స్ – కృష్ణ చైతన్య, సంగీతం – శ్రవణ్ , ఎడిటర్ – గౌతం నెరుసు, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ, ఫైట్స్ – డ్రాగన్ ప్రకాష్, కో డైరెక్టర్: సురేష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ – జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత – డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం – పవన్ సాదినేని.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న నారారోహిత్ ‘సావిత్రి’
యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి  విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వట...
‘సావిత్రి’ ఆడియో విడుదల
‘సావిత్రి’ ఆడియో విడుదలనారారోహిత్ హీరోగా విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై పవన్ సాధినేని దర్శకత్వంలో డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత...
`సోలో` త‌ర్వాత మ‌ళ్లీ ఓ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించాను
`సోలో` త‌ర్వాత మ‌ళ్లీ ఓ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించాను: - `సావిత్రి` సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మంలో నారా ర మార్చి 4న `సావిత్రి` ఆడి...
powered by RelatedPosts