దుమ్మురేపుతున్న మోక్షజ్ఞ పోస్టర్స్

0

Nandamuri Mokshagna Birthday Special Posterఎట్టకేలకు… ఎందరో నందమూరి అభిమానుల ఆకాంక్ష నెరవేరింది. తమ అభిమాన నటుడు బాలయ్య సుపుత్రుడు మోక్షజ్ఞ ని తెరమీద చూసేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానుల పంట పండింది. నందమూరి బాలకృష్ణ నట వారాసుడు మోక్షజ్ఞ ఇంకా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండానే నందమూరి బాలయ్య అభిమానులు తమ అభిమాన హీరో కుమారుడికి ‘యంగ్ లయన్’ అని ట్యాగ్ పెట్టడమే కాకుండా ఈ బిరుదును ఇప్పటి నుంచే ప్రచారంలోకి తీసుకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కనిపిస్తున్న పోస్టర్లు ఆశక్తి కరంగా ఉన్నాయి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా టాలీవుడ్ ను ఆదరకొడుతూ ఉంటే ఇంకా పూర్తిగా యుక్త వయసు కూడ రాని మోక్షజ్ఞ ‘యంగ్ లయన్’ గా మారి టాలీవుడ్ ను షేక్ చేస్తాను అని సంకేతాలు ఇస్తున్నాడు.

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న బాలయ్య నట వారసుడు ఒక వైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపు సినీ రంగ ప్రవేశానికి కావాల్సిన నటన, డాన్స్, ఫైట్స్ లాంటి విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని ఇప్పటికే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు బాలయ్య. మరో మూడు సంవత్సరాల తరువాత కాని ప్రారంభం కాని మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశ హడావిడి అప్పుడే ప్రారంభం అయిపోయిందా అనేటట్లుగా ఈ పోస్టర్ల హంగామా కనిపిస్తోంది. ఇక రానున్న రోజులలో నందమూరి వంశం నుండి వచ్చిన ఒక టైగర్ మరో లయన్ టాలీవుడ్ ను ఏలుతాయి కాబోలు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts