దాసరి మదిలో "ఒసేయ్ రాములమ్మ-2"?

0

Dasari-Narayana-on-his-65th-Birthdayహీరోయిన్‌లకి హీరోల ఇమేజ్ తీసుకొచ్చిన అలనాటి అందాల తార విజయశాంతి కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచి ఎంతో కీర్తిని, అవార్డ్‌లని అందించిన చిత్రం “ఒసేయ్ రాములమ్మ”. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది . విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయ శాంతి నటించిన సినిమాలన్నిటిలోనూ పెద్ద హిట్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో వున్నారు అని వినికిడి.

ప్రస్తుతం దాసరి తన 151వ సినిమా ఎర్ర బస్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమానే కాక దాసరి విష్ణుని హీరోగా పెట్టి తమిళ సూపర్ హిట్ సినిమా “మంజపై”కి రిమేక్ తీస్తున్నాడు. ఈ సీక్వెల్ ని ఆ సినిమా తరువాత ప్లాన్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే విజయశాంతి సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రకటించింది కాబట్టి , “ఒసేయ్ రాములమ్మ-2” చిత్రం తెరకెక్కొచ్చేమో మరి.

అయితే, అప్పటి విజయశాంతికి – ఇప్పటి విజయశాంతికి చాలా మార్పులు వచ్చాయి. వయసు మీద పడుతున్న ఈ దశలో విజయశాంతి ఈ సినిమాకి ఒప్పుకుంటుందా? ఒకవేళ దాసరి మదిలో ఇంకేవరైనా ఉన్నారా అన్నది కొద్ది రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts