దసరాకి "రుద్రమదేవి" ఫస్ట్ లుక్ టీజర్

0

Rudhramadeviబహుశా దర్శకుడు గుణశేఖర్, తన కెరీర్ లోనే “రుద్రమదేవి” లాంటి సినిమా మరొకటి చేయకపోవచ్చు. ఎందుకంటే, ఆ సినిమా కోసం గుణశేఖర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. దాదాపు తొమ్మిదేళ్ళు పరిశోధన చేసి మరీ గుణశేఖర్ “రుద్రమదేవి” సినిమాని తెరకెక్కించాడు. భారతేశంలోనే మొట్టమొదటి సారిగా, స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా కానుకగా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన నటీనటుల డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts