దర్శకురాలిగా మారనున్న టాప్ హీరోయిన్?

0

rani mukerji.,ఆల్రెడీ ఒక దశాబ్దానికి పైగా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన పిల్లి కళ్ళ సుందరి రాణీ ముఖర్జీ, ఇక నటనకి స్వస్తి పలుకుతుందో… లేక కొనసాగిస్తుందో మరి ప్రస్తుతానికి తెలియదు కానీ, అమ్మడు ప్రస్తుతం దర్శకురాలి అవతారం ఎత్తనుంది అని బాలీవుడ్ మొత్తం కొక్కోరొక్కో అంటోంది. ఇటీవలే ‘మర్దానీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాణీ ముఖర్జీ, ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం విదితమే. ఇకనుంచీ తెరపై బాధ్యతాయుతమైన పాత్రల్లో కన్పించాలనే నిర్ణయానికి వచ్చిన రాణీముఖర్జీ, మెగాఫోన్‌ పట్టుకుని సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని భావిస్తోందట.

త్వరలోనే తాను మెగాఫోన్‌ పట్టనున్న విషయాన్ని స్వయంగా ఆమె మీడియాకి వెల్లడించనుందంటూ బాలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. భర్త ఆదిత్య చోప్రా ‘మర్దానీ’ సినిమాని నిర్మించగా, అదే బ్యానర్‌పై రాణీముఖర్జీ దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై సంపూర్ణ అవగాహన సంపాదించుకున్న రాణీముఖర్జీ, కొన్ని కథల్ని కూడా సిద్ధం చేసుకునే పనిలో బిజీగా వుందట. హీరోయిన్‌గా ఇక సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతోనే రాణీముఖర్జీ మెగాఫోన్‌ పట్టాలనుకుంటోందంటూ వస్తోన్న ఊహాగానాల్ని ఆమె కొట్టి పారేస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts