త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది…

0

దేశం గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన “అమృత” అనే చిత్రంలో నటించిన చిన్న పాప, హీరో పార్తీబన్ – నటి సీత ల కుమార్తె కీర్తన గుర్తుందా?ఆ చిత్రంలో బాలనటిగా ఆదరగొట్టేసీన కీర్తన ఇప్పుడు పెద్దది అయింది. కాకపోతే తనకిప్పుడు నటన మీద ఏమాత్రం ఆసక్తి లేదట. త్వరలో ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నా అంటోంది.. ప్రస్తుతం కీర్తన తండ్రి పార్తిపన్ కదై తిరైకథై వచనం ఇయక్కం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తన సహ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించకుండా నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. అయితే తన లక్ష్యం మాత్రం మెగా ఫోన్ పట్టడమేనంటోంది.

అరణ్య కాండం చూసినప్పటి నుంచి ఆ చిత్ర దర్శకుడు త్యాగరాజ కుమార్ రాజా వద్ద శిష్యరికం చేయాలనే కోరిక కలిగిందట. ఈ విషయాన్ని తన తండ్రి పార్తిపన్‌కు విన్నవించుకోగా ఆయన వెంటనే త్యాగరాజా కుమార్‌రాజాతో మాట్లాడి ఆయన వద్ద సహాయ దర్శకురాలిగా చేర్చారట. అయితే హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసే ఆలోచన లేదా అంటే క్రియేటివ్ దర్శకురాలిగా పేరు తెచ్చుకుంటానంటోంది కీర్తన. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు సరైన సమయం రాగానే బాధ్యతలను చేపడతానని కీర్తన అంటోంది.

కీర్తనకి మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదామా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Akhil Akkineni, Vikram K.Kumar, Akkineni Nagarjuna's Film Titled As "Hello"
Akhil Akkineni's latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar's Direction, Produced by Akkineni Nagarjuna ge...
`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
powered by RelatedPosts