తేజ దర్శకత్వంలో కమల్!

0

tejaప్రయోగాత్మక చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న కమల్‌హాసన్, వినూత్నమైన ప్రేమకథాచిత్రాలతో గుర్తింపు పొందిన తేజ ఈ ఇద్దరి కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్, దశ్యం రీమేక్‌లో నటిస్తున్నారు కమల్. ఈ చిత్రాల ఆనంతరం తేజ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకే చిత్రీకరణ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కమల్‌హాసన్ దశ్యం రీమేక్‌తో పాటు ఉత్తమ విలన్ చిత్రం షూటింగ్‌లో బిజీగా వుండటం వల్ల గత కొంత కాలంగా వాయిదాపడుతూ వస్తోంది. ఓ వినూత్నమైన కథాంశంతో తేజ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర వర్గాల సమాచారం.

వర్షంలో హోరా హోరి…
ప్రేమకథలు తెరకెక్కించడంలో దర్శకుడు తేజది ప్రత్యేక శైలి. ఆయన స్వీయ దర్శకత్వంలో తాజాగా మరో ప్రేమకథా చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమా ద్వారా దిలీప్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. కథానుసారం సినిమా అంతా వర్షంలోనే సాగుతుంది. అందుకే చిత్రీకరణ సహజ సిద్ధంగా వుండాలని వర్షాకాలంలో మొదలుపెట్టబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తానని తేజ తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts