తెలుగు సినిమాలు చేస్తాను!

0

Deeksha Seth Latest Hot Photos (10)వేదం సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు పరిచయమైన దీక్షాసేథ్ లేకర్ హమ్ దీవానా దిల్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ దివంగత నటుడు రాజ్‌కపూర్ మనవడు అర్మాన్ జైన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఆరిఫ్ ఆలీ దర్శకత్వంలో దినేష్ విజన్, హీరో సైఫ్ ఆలీఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హీరో అర్మాన్ జైన్, దీక్షాసేథ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దీక్షాసేథ్ మాట్లాడుతూ సినిమాల్లోకి ప్రవేశిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఒక సందర్భంలో దర్శకులు క్రిష్ కలిసి ఏంజిల్ లాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. మీరైతే బాగుంటుందని నన్ను ఒప్పించారు అలా వేదం సినిమాతో అనుకోకుండా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. రెబల్ సినిమా రిలీజ్‌కు ముందే ప్రస్తుతం చేస్తున్న లేకర్ హమ్ దీవానా దిల్ సినిమా స్క్రిప్ట్‌ని దర్శకుడు ఆరిఫ్ అలీ వినిపించాడు. అతను చెప్పిన కథ నన్నెంతగానో ఆకట్టుకుంది. దాంతో వెంటనే అంగీకరించాను.

టాలీవుడ్‌ని వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేదు. మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తాను అని తెలిపింది. అర్మాన్ జైన్ మాట్లాడుతూ మా కుటుంబంలో అందరూ నటులే. ఈ సినిమాలో మంచి నటనని ప్రదర్శించానని భావిస్తున్నాను. సినిమాలో దీక్షా దక్షిణాది అమ్మాయిగా నటిస్తోంది. రణ్‌బీర్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి నేను పోటీ కాను అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Akhil Akkineni, Vikram K.Kumar, Akkineni Nagarjuna's Film Titled As "Hello"
Akhil Akkineni's latest film presented by Annapurna Studios, Manam Enterprises in Vikram K.Kumar's Direction, Produced by Akkineni Nagarjuna ge...
powered by RelatedPosts