తెలంగాణ శకుంతల కన్నుమూత

0

Telangana_Shakunthalaజ్యేష్ట మాసం 24 వ తేదీ, శ్రీ జయనామ సంవత్సరం (జూన్ 14, 2014 ఆంగ్లం):ప్రముఖ నటి, తెలుగువారికి సుపరిచితురాలు తెలంగాణా శకుంతల కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాతి సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో హుటాహుటిన సూరారం లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆమె వయస్సు 65 సంవత్సరాలు. తెలంగాణ శకుంతలగా అనేక ప్రధాన చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో ఆమె చెరగని ముద్రవేసుకున్నారు. ప్రధానంగా తెలంగాణా యాసలో మాట్లాడుతూ చలనచిత్రాలలో అనేక పాత్రలు పోషిచారు శకుంతల. 1981 లో నిర్మించిన మా భూమి చిత్రం ద్వారా శకుంతల చాలనచిత్రాలలో ప్రవేశించారు. అనంతరం అనేక చిత్రాలలో నటించి మరువలేని నటిగా నిలిచారు. ఈమె నటించిన చివరి చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. హాస్య భరిత పాత్రలో భీకరాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ శకుంతల దిట్ట. ఈ నేపధ్యంలో ఆమె వేసిన అనేక చిత్రాలలోని పాత్రలు అటు యువతారాన్ని, ఇటు మధ్య వయస్కులను బాగా ఆకరిశించాయని చెప్పవచ్చు.

విషాదఛాయలు : శకుంతల మృతిలో ఆమె నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు శకుంతల భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అల్వాల్ స్మశానవాటికలో శకుంతల అంత్యక్రియలు జరగనున్నాయి.  

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts