తెలంగాణా శకుంతలకి ఘనంగా నివాళులు

0

Telangana Sakuntala (45)

ఈ రోజు తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచిన నాటి తెలంగాణా శకుంతలకి సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో నివాళులు అర్పించారు . శకుంతల కుటుంబానికి తమ సంతాపాన్ని, సానుభూతినీ తెలియజేశారు. మహారాష్ట్రలో పుట్టి, టాలీవుడ్ తెరమీద విభిన్న పాత్రలు పోషించి అశేషాంధ్రుల ఆదరాభిమానాలు చూరగొన్న తెలంగాణ శకుంతల హఠాన్మరణం ఎందరినో కలచివేసింది. తెలంగాణా శకుంతల కి పలువురు నటీ నటులు, టాలీవుడ్ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. శకుంతల ఇప్పటివరకు 250 సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్ పురి లాంటి భాషల్లో ఆమె తన నటనా ప్రావీణ్యం ప్రదర్శించారు.

మా భూమి, రంగులకల, నువ్వునేను చిత్రాల్లో ఆమె నటనకు నంది అవార్డులు కూడా వచ్చాయి. కాగా, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణ శకుంతల పార్థివ దేహాన్ని ఉంచి, ఆ తర్వాత అల్వాల్ లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శకుంతలకు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించినవారిలో నటీనటులు సమంత, సిద్దార్థ, లక్ష్మి మంచు, నిఖిల్, ప్రణీత, సందీప్ కిషన్ తదితరులున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
powered by RelatedPosts