తాప్సీ లైవ్‌షో…!

0

tapseeసినిమాలకు సంబంధించిన వివిధ ప్త్రెవేట్ కార్యక్రమాల్లో నిర్వహించే లైవ్‌షోలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. తమ అభిమాన తారల ఆటాపాటల్ని ప్రేక్షకులు లైవ్‌గా చూసే అవకాశం లభిస్తుండటంతో ఈ షోలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ లైవ్ కార్యక్రమాల్లో ఆహుతుల్ని మెప్పించడం మామూలు విషయం కాదు.

సినిమాల్లో మాదిరిగా ఇక్కడ రీటేక్‌లకు అవకాశం లేకపోవడంతో ముందస్తుగా చక్కటి సాధన చేసి స్టేజీపైకి ఎక్కాల్సివుంటుంది. దక్షిణాదిన అగ్ర కథానాయికలు చాలా మంది ఈ తరహా షోలకు దూరంగా వుంటారు. అయితే పంజాబీముద్దుగుమ్మ తాప్సీ మాత్రం తొలిసారిగా లైవ్‌షోతో ప్రేక్షకులను పలకరించబోతోంది. చెన్నైలో నిర్వహించబోయే ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఫంక్షన్‌లో ఈ సుందరి తన నృత్యాలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది తాప్సీ. జీవితంలో తొలిసారిగా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను. కెమెరాముందు కాకుండా వేదికపై నర్తించడం ఇదే మొదటిసారి. మీ అందరి ఆశీస్సులతో సక్సెస్ అవుతాననే నమ్మకముంది అని పేర్కొంది తాప్సీ. షాడో చిత్రం తర్వాత తెలుగుపరిశ్రమకు దూరమైన ఈ సొగసరి ప్రస్తుతం తమిళంలో ముని-3 వాయ్ రాజా వాయ్ చిత్రాల్లో నటిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts