తనరేటుని మరో 50 లక్షలు పెంచిన ముద్దుగుమ్మ

0

Samantha2అవకాశం ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి అని సినిమా తారలకి మనం చెప్పే అవసరం లేదేమో. ఆ మాటనే సౌత్ ఇండియన్ బిజీ హీరోయిన్ సామంతా నిరూపిస్తోంది మరి. వివరాల్లోకి వెళ్తే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రిమెంట్ తర్వాత కూడ హీరోయిన్ మరో యాభై లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని పెంచుకున్న హీరోయిన్ గా సమంత నిలిచిపోతుంది. సమంత ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజిగా ఉన్న హీరోయిన్. అయితే కోలీవుడ్ లో సమంత చేస్తున్న మూవీల సంఖ్య మూడుకి చేరుకుంది. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ అగ్రిమెంట్స్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా సమంత రెమ్యునరేషన్ టాపిక్, హాట్ న్యూస్ లా మారింది.

సమంత నటిస్తున్న లేటెస్ట్ అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ ఫిల్మ్. మురుగదాస్ నిర్మాణంలో సమంత ఒక చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో సమంత, హీరో విక్రమ్ సరసన చేస్తుంది. ఇదిలా ఉంటే మొదటగా ఈ మూవీకి సమంత దాదాపు కోటి రూపాయల రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టు అగ్రిమెంట్స్ చేసుకుంది. కాని అనూహ్యంగా మురుగదాస్ ఈ మూవీను ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ అయిన ఫాక్స్ స్టూడియోస్ తో భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. దీంతో సమంత ఎవో కారణాలు చెబుతూ తన రెమ్యునరేషన్ ని మరో యాభై లక్షలకు పెంచుకుంది. ఇప్పుడు సమంత రెమ్యునరేషన్ వచ్చేసి దాదాపు కోటిన్నర రూపాయలకు చేరుకుంది.

సమంతకు అంత రెమ్యునరేషన్ ఇవ్వవటానికి మురుగదాస్ సైతం ఏ మాత్రం సంకోచించడం లేదు. ఎందుకంటే సగానికి పైగా ఈ మూవీను మనీను ఇస్తున్నది ఫాక్స్ స్టూడియోన్ కావడమే. సంస్థ రేంజ్ కి తగ్గట్టుగానే సమంతకి అవసరం లేకున్నా, ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని కోలీవుడ్ టాక్. మొత్తానికి అగ్రిమెంట్స్ తరువాత సమంత ఈ తరహా మార్పులు చేస్తుంటే కోలీవుడ్ లోని కొందరు నిర్మాతలు ఈ బ్యూటీను కలవాలంటేనే వణికిపోతున్నారంట. ఎందుకంటే మూవీకు ఒప్పుకున్నా, స్టార్ట్ అయ్యేసరికి ఎన్ని మార్పులు, చేర్పులు చేస్తుందో అంటు మాట్లాడుకుంటున్నారు.

తీసుకోమ్మా, నీ సొమ్మేం పోయింది… రోజుకి ముప్పై ఐదు వేల తిండి దగ్గర నుంచి ప్రతిదీ నిర్మాతల నెత్తి మీదే రుద్దే నీకు, అగ్రిమెంట్ తర్వాత కూడా యాభై లక్షలు పారితోషికాన్ని పెంచే అవసరాలు ఎన్నున్నాయో పాపం… తీసుకోమ్మా…. తీసుకో …!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts