డబ్బింగ్ చెప్పుకుంటున్న "ముకుంద"

0

Mukunda3మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలొచ్చారు . తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా “ముకుంద” అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మొన్న చిరంజీవి జన్మదినం సందర్భంగా, “ముకుంద” సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు . మెగా ఫ్యాన్స్ నుండి ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాకి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు. మొట్ట మొదటిసారి డబ్బింగ్ థియేటర్ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ బాగా ఉత్కంఠకి లోనయ్యారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts