డబుల్ ధమాకా అంటే ఇదే !!

0

run-rajaవరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో శర్వానంద్ కి “రన్ రాజా రన్” చిత్రం పెద్ద ఊరటనిచ్చింది. ఎట్టకేలకు ఒక సినిమా సూపర్ హిట్ కావడంతో, శర్వానంద్ గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు. . ఇక్కడి నిర్మాతలకి “రన్ రాజా రన్ ” లాభాలు తెచ్చిపెట్టడంతో ,ఇదే సినిమాని త్వరలో తమిళంలో డబ్బింగ్ చేయించి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ‘మిర్చి’ సినిమా అందించిన వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకుడుగా ఉన్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ హిట్ సినిమాని తమిళంలో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యాలన్నట్టుగా, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ కూడా చెప్పాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీని చూసిన ఓ తమిళ డైరెక్టర్, శర్వానంద్ కోసం ప్రత్యేకంగా ఓ స్టోరిని డిజైన్ చేశాడంట. ఆ మూవీ కేవలం తమిళ ఆడియన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని మాత్రమే శర్వానంద్ పాత్రని డైజైన్ చేసినట్టు తెలుస్తుంది. కోలీవుడ్ కి చెందిన టాప్ డైరెక్టర్ రెడీ చేస్తున్న కథలో శర్వానంద్ హీరోగా నటిస్తుండటంతో ప్రస్తుతం ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి శర్వానంద్ తాజాగా హిట్ సాధించిన మూవీతో ఓ బంపర్ ఆఫర్ ని చేజిక్కించుకున్నాడని అంటున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts