‘టెర్రర్’ విజయోత్సవ వేడుక

0

ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి వైవిధ్యమైన పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే ఆరడుగుల అందగాడు శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమ్ సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన చిత్రం ‘టెర్రర్’. ఇటీవల విడుదలయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ నా తొలి సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ప్రారంభమైన తొలి రోజు నుంచి విడుదలయ్యే వరకు హీరో శ్రీకాంత్ గారు అన్ని విధాల సహకరించడం వలన ఈ సినిమా ఈ రోజు ఇంత మంచి పేరు తెచ్చుకుంది. మా దర్శకుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే లక్ష్మీ భూపాల్ గారి సంభాషణలు, సాయికార్తీక్ గారి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలన్నారు, త్వరలో ఈ చిత్ర విజయోత్సవ టూర్ ను తెలుగు రాష్ట్రాల్లో ని కొన్ని ప్రాంతాల్లో ప్రారంబించనున్నామంటూ తెలిపారు. దర్శకుడు సతీష్ కాసెట్టి మాట్లాడుతూ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కావడంతో నేను చెప్పిన కథకు కనెక్టయ్యారు మా నిర్మాత షేక్ మస్తాన్ ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాని అనుకున్న విధంగా చేయడానికి ఫ్రీడం ఇచ్చారు. అందుకే సినిమాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇక శ్రీకాంత్ గారు ఎంత మంచి యాక్టరో అంతకు మించి మంచి వ్యక్తిత్వమున్న వారు. ‘టెర్రర్’ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. వారందరికీ నా ధన్యవాదాలు అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సరిగ్గా 25 యేళ్ల క్రితం ‘ఎన్ కౌంటర్’ సినిమా విడుదలైంది. అందులో నక్సలైట్ లీడర్ గా నటించాను. ఇప్పుడు టెర్రర్ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు కావొస్తున్నతరుణంలో టెర్రర్ విడుదల కావడం, సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా చేస్తే హిట్ చేస్తారని ప్రేక్షకులు నిరూపించారు. చాలా కాలం తర్వాత మంచి సినిమా చేశానన్న తృప్తి కలిగింది. సినిమాకు థియేటర్స్ కూడా పెరిగాయి. ఇక మీదట మంచి సినిమాలు మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యానని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమం లో నటుడు రవి వర్మ, విల్లన్ ముస్తఫా, రైటర్ లక్ష్మీ భోపాల్ లతో పాటు ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చి 4న రానున్న శ్రీకాంత్ 'టెర్రర్'..!
శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సి...
`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
powered by RelatedPosts