టిటిడి ఛైర్మన్ పదవి రేసులో శివాజీ?

0

sivaji-new-stills-e48a03b3ప్రస్తుతం ఎందరో సినీ,రాజకీయ ప్రముఖుల కళ్ళు పడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధ్యక్ష పదవి రేసులో, మరో ఫ్లాప్ హీరో కన్నేసాడు అని తెలుస్తోంది. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులవుతున్న నేపధ్యంలో , ఏదో ఒక జాబ్ చూసుకోవడం మేలు అనుకున్నాదో ఏమో కానీ, హీరో శివాజీ ఏకంగా టిటిడి ఛైర్మన్ పదవికే ఎసరు పెట్టినట్టు వార్తలు అందుతున్నాయి. టీటీడీ చైర్మన పదవి తనకు దక్కుతుందని అతడు నమ్మకంగా చెబుతున్నాడు. అయితే పదవి కోసం తాను పైరవీలు చేయనని, పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీటీడీ చైర్మన్ గిరి రేసులో తానున్నాంటూ శివాజీ ప్రకటించడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులు ఉలిక్కి పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదవిపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్‌లు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వస్తూనే చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని టీడీపీ సర్కారు రద్దు చేసింది. పాత పాలక మండలి గడువుకు 11 రోజులకు ముందే ఈ నిర్ణయం తీసుకుంది. పాలక మండలిని రద్దు నెలన్నర కావొస్తున్నా ఇంతవరకు నూతన పాలక మండలిని నియమించలేదు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదన్న శివాజీ- టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చొవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అయితే బీజేపీ అతడికి హామీయిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అతడికి ఈ పదవి దక్కుతుందో, లేదో చూడాలి. ఏ అర్హత ఉందని శివాజీని ఆ పదవి ఇప్పిస్తా అంటూ ప్రోత్సహిస్తున్న నాయకులు ఎవరు అన్నది తేలాల్సి ఉంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts