జీవితకథల నాయిక !

0

vidya-balanప్రముఖుల జీవితకథల ఆధారంగా తెరకెక్కించే చిత్రాలు ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తాయి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో వచ్చిన డర్టీపిక్చర్ భాగ్‌మిల్కా భాగ్ పాన్‌సింగ్ తోమర్ చిత్రాలు చక్కటి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దీంతో బయోపిక్‌లను రూపొందించడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదిలావుండగా మహిళా జీవితకథలతో రూపొందించే చిత్రాలకు విద్యాబాలన్ పేరును ప్రముఖంగా పరిశీలిస్తుండటం విశేషం. వారం వ్యవధిలోనే ఆరుగురు ప్రముఖుల జీవితకథా చిత్రాల్లో నటించమని విద్యాబాలన్‌కు ఆఫర్లు రావడం హిందీ చిత్రసీమలో చర్చనీయాంశమయింది. బాలీవుడ్ కథానాయిక మీనాకుమారి, మొదటి ఐ.పి.యస్.అధికారిణి కిరణ్‌బేడీ, ప్రఖ్యాత గాయని బేగమ్‌అక్తర్, భారతదేశ తొలిమహిళా డాక్టర్ రక్మాబాయి, సుప్రసిద్ధ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ప్రఖ్యాత కవయిత్రి కమలాదాస్ జీవితగాథల ఆధారంగా రూపొందించే చిత్రాల్లో నటించమని విద్యాబాలన్‌ను సంబంధిత చిత్రాల దర్శకనిర్మాతలు కోరారని తెలిసింది.

డర్టీపిక్చర్ కహానీ చిత్రాల్లో విద్యాబాలన్ ప్రదర్శించిన అసమాన అభినయానికి ముగ్ధులైన పలువురు దర్శకనిర్మాతలు ఆటోబయోగ్రఫీ చిత్రాల్లో ఆమెకే తొలిప్రాధాన్యతనిస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యం.యస్.సుబ్బులక్ష్మి జీవితగాథ ఆధారంగా రూపొందించే చిత్రంలో నటించడానికి విద్యాబాలన్ ఆసక్తిచూపుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి రాజీవ్‌మీనన్ దర్శకత్వం వహించబోతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts