జవాబు దొరకాలి!

0

Karthikeya (7)నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న చిత్రం కార్తీకేయ . మాగ్నస్ సినీప్త్రెమ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. చందు మొండేటి దర్శకులు. త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పురాతన ఆలయం నేపథ్యంలో నడిచే కథ ఇది. ఆ గుడి తలుపులు మూసి వుంచడం వెనకున్న రహస్యమేమిటి? ఆలయంలోని మార్మిక శక్తులేమిటి?అనే ఆసక్తికర విషయాల శోధనతో సాగుతుంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ వైద్యవిద్యార్థులుగా కనిపిస్తారు.

తన మదిలో ఉత్పన్నమయిన ప్రశ్నలకు జవాబు దొరికేంత వరకు విశ్రమించని ధైర్యవంతుడైన యువకుడిగా హీరో నిఖిల్ పాత్ర చిత్రణ వుంటుంది. గతంలో ఆయన చేయనటువంటి పాత్ర ఇది. వినోదం మేళవించిన థ్రిల్లర్ చిత్రమిది. రొటీన్‌కు భిన్నంగా తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది.

వినసొంపైన బాణీలతో పాటలు సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకముంది అన్నారు. తనికెళ్ల భరణి, రావు రమేష్, కిషోర్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ ఘట్టమనేని, ఎడిటింగ్:కార్తీక్ శ్రీనివాస్, సంగీతం:శేఖర్ చంద్ర, సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Yuddham Sharanam' title song will be out tomorrow
The Second single from Chay Akkineni, Lavanya Tripathi & Srikanth's #YuddamSharanam will be out tomorrow at 3 pm. Music by 'Pellichoopulu' fa...
 మెగాస్టార్ కి కృత‌జ్ఞ‌త‌లు: త‌మిళ‌నాడు తెలుగు యువ శ‌క్తి
మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు. మా మాటను మన్నించి  తొలి తెలుగు స్వాతంత్ర్య సమారా యోధుడు   జీవిత చరిత్ర సినిమాకు సై.. సై.. రా నరసింహారెడ్డి టై...
నా పరిచయ చిత్రం "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" కావడం నా అదృష్టం!!
'చంద్రకాంత్-రాధికా మెహరోత్రా'లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. 'థర్డ్ ఐ క్రియేషన్స్' పతాకంపై.. 'రఘురాం రొయ్యూరు'తో కలిసి.. గోవర్ధన్,జి స్వీయ ద...
powered by RelatedPosts