చెర్రీ కొత్త కారు నంబర్ ఇదే

0

Chiranjeevi Birthday  (8)అదంతే… కొందరు ఏం చేసిన అదో న్యూస్ అయిపోతుంది . అదీ, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీ హీరో రామ్ చరణ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోకి సంబంధించిన విషయం ఐతే, మీడియా కళ్ళు పడకుండా ఉంటాయా? ఇంతకీ విషయం ఏమిటి అంటే, రామ్‌చరణ్ తేజ్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. కొత్తగా కొనుగోలు చేసిన తన వాహనం మెర్సిడెస్ బెంజ్ రిజిస్ట్రేషన్ కోసం చెర్రీ స్వయంగా వచ్చి, డిజిటల్ ప్యాడ్ పై సంతకం చేశాడు.

రూ.10వేల రుసం చెల్లించి ‘టీఎస్ 09, ఈబీ 2727’ నెంబర్ పై వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణ అధికారి దశరథం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక చిరంజీవి పుట్టినరోజునే రామ్ చరణ్ కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం గమనార్హం. ఇక నాన్న పుట్టినరోజు కానుకగా రామ్ చరణ్…ఆయనకు ఓ కారును బహుమతిగా ఇచ్చారు. చిరంజీవి ప్రతి బర్త్‌డేకి ఏదో ఒక గిప్ట్ ఇచ్చే చెర్రీ …ఈసారి ల్యాండ్ క్రూజర్ ను ప్రజెంట్ చేశాడు.

మరి దాని రిజిస్ట్రేషన్ కి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆర్టీఎ కార్యాలయానికి వస్తాడా అన్నది ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న. ప్రస్తుతం కుటుంబసమేతంగా నేపాల్ పర్యటనలో ఉన్న చిరంజీవి తిరిగి హైదరాబాదుకి వచ్చాక, మరి రిజిస్ట్రేషన్ సంగతి చూస్తారేమో వేచి చూద్దాం మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌న్నీలియోన్ నా..మ‌జాకా!
హీరోయిన్ల‌లో ఎవ‌రికైనా ఇంత ఫాలోయింగ్ ఉంటుందా? ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం ఏ హీరోయిన్ కోస‌మైనా వ‌చ్చారా? అంటే ఇక‌పై ఠ‌క్కున గుర్తొచ్చే ఒకే ఒక...
బి..సీల్లో తేడాసింగ్ ర‌చ్చ ర‌చ్చే!
నంద‌మూరి న‌ట‌సింహాన్ని (బాల‌కృష్ణ‌) ఇప్ప‌టివ‌ర‌కూ ఒక యాంగిల్ లోనే చూశాం. ఇప్పుడు రెండ‌వ యాంగిల్ ను డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `పైస...
వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
powered by RelatedPosts