చెన్నైలో దిగిన 'టెర్మినేటర్'

0

Arnoldఅతనొక కండల వీరుడు. కేజీ కండ పెట్టుకునే తెగ పోస్ కొట్టే జనాలున్న ఈ జమానాలో, ఒళ్ళంతా కండలు తప్ప మరొకటి లేని హాలీవుడ్ యాక్షన్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ ఇంకెంత పోస్ కొట్టాలి? కానీ ఆర్నాల్డ్ చాలా సౌమ్య జీవి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఐ” చిత్రం తాలూకు ఆడియో రిలీజ్ వేడుక ఈరోజు జరుగుతున్న నేపధ్యంలో సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో ఆర్నాల్డ్ దిగాడు. తమిళనాడు ప్రభుత్వం ఆర్నాల్డ్ కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సంచలన తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం ‘ఐ’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి జయలలితను ఆయన కలుసుకుంటారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరిగే ‘ఐ’ ఆడియో ఫంక్షన్ లో కండల వీరుడు ష్వాజ్ నెగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts