చిరు 150వ సినిమాలో ఐశ్వర్య స్పెషల్ సాంగ్?

0

download (1)టాలీవుడ్ ని ప్రస్తుతం ఒక్కసారిగా కుదిపి ఎత్తేసిన వార్త ఇది. ప్రస్తుతానికి పుకార్ల దశలోనే ఉన్న ఈ వార్తనే కనుక నిజం అయితే మాత్రం అంతకంటే అదిరిపోయే న్యూస్ ఇంకోటి ఉండదు. ఇక విషయానికి వస్తే, చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తన 150 వ సినిమా పట్ల ఏమాత్రం తొందరపడటం లేదు . ప్రతీదీ ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త వస్తూనే వుంది. ఇంకా కథగానీ, డైరెక్టర్ గానీ ఫైనలైజ్ కాకపోయినప్పటికీ.. హీరోయిన్ల చిట్టా మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే వుంది. ఇప్పటికే చిరు కొత్త సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా త్రిష, శ్రియ, నయనతార, అనుష్కలలో ఎవరో ఒకరు నటించడం ఖాయమని వార్తలు జోరుగానే సాగాయి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా తెరమీదకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఐశ్వర్య రాయ్ కూడా చేరిపోయింది. ప్రస్తుత అంతర్గత సమాచారాల ప్రకారం.. ఐశ్వర్య, చిరుతో చిందులేయడం ఖాయమని చెబుతున్నారు కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

ఇదిలావుండగా.. ఇర్ఫాన్ ఖాన్ ప్రధానపాత్ర పోషిస్తున్న ‘‘జజ్బా’’ సినిమాలో ఐశ్వర్య నటించడానికి ఓకే చెప్పేసింది. ఈ మూవీ డిసెంబర్ నుంచి స్టార్ట్ కాబోతోంది. అలాగే మరో సినిమాకోసం బాలీవుడ్ దర్శకనిర్మాతలతో ఐష్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ చిరు 150వ మూవీ మేకర్స్ ఐశ్వర్యను సంప్రదిస్తే.. తానున్న పరిస్థితిల్లో డేట్స్ అడ్జస్ట్ కాక అందుకు నిరాకరించవచ్చునే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే.. ఐశ్వర్య కూడా చిరుతో నటించడం కష్టమేనని ఇన్ సైడ్ టాక్! అయినప్పటికీ ఐశ్వర్య డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుని చిరుతో నటించడానికి అంగీకరిస్తే మాత్రం.. సౌత్ ఇండస్ట్రీలో ఇదొక గ్రేట్ కాంబినేషన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

మరోవైపు చిరు 150వ సినిమాను ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నట్టు అందరికీ తెలిసిందే! అయితే వీరిద్దరి నుంచి 150వ చిత్రానికి సంబంధించి ఇంతవరకు ఏ సమాచారం అందడం లేదు. తన బర్త్ డే నాడే 150వ చిత్రం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన మెగాస్టార్.. ఇంతవరకు నోరుమెదకపోవడంపై ఫ్యాన్స్ కాస్త నిరాశగానే వున్నట్లు తెలుస్తోంది. రానురాను ఈ మూవీకి సంబంధించి ఇంకెన్ని పుకార్లు రానున్నాయో!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts