చిరంజీవి సినిమాకు కథ సిద్ధం

0

VV Vinayak Interview Photosతెలుగు సినిమాను కమర్షియల్‌గా కొత్తపుంతలు తొక్కించిన దర్శకుల్లో వి.వి.వినాయక్ ఒకరు. ఆయన మార్క్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్ ఇమేజ్ వుందనడం అతిశయోక్తికాదు. హీరోయిజాన్ని పతాకస్థాయిలో ఆవిష్కరిస్తూ సకల వాణిజ్య హంగులతో జనరంజక చిత్రాల్ని రూపొందించడం ఆయన శైలి. అత్యధిక విజయాలతో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తోన్న దర్శకుల్లో వినాయక్ ఒకరు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం అల్లుడు శీను. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకులముందుకురానుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో వి.వి.వినాయక్ రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి…vinayakబెల్లంకొండ సురేష్ తనయుడిని పరిచయం చేసే బాధ్యతని తీసుకోవడం పట్ల ఎలా ఫీలవుతున్నారు?
ఆది చిత్రం ద్వారా బెల్లంకొండ సురేష్‌గారు దర్శకుడిగా నన్ను సినీరంగానికి పరిచయం చేశారు. ఆనాటి నుంచి మా ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం కొనసాగుతోంది. పరిశ్రమలో నాకెంతో సన్నిహితుడైన సురేష్‌గారి కుమారుడు సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను.

కెరీర్‌లో తొలిసారిగా కొత్త హీరోతో సినిమా చేస్తున్నారు. సాయిశ్రీనివాస్ పర్‌ఫార్మెన్స్ ఎలా అనిపించింది?
ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ నటన చూస్తే కొత్తహీరో అనే భావవ ఎక్కడా కలుగదు. ప్రతి అంశంలో అతను పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌లాంటి సీనియర్స్ ముందు నటించాలంటే కొత్తవారు టెన్షన్‌కు లోనవుతారు. వారి ముందు కూడా సాయిశ్రీనివాస్ ఎలాంటి బెరుకు లేకుండా సెటిల్డ్‌గా నటించాడు. సినిమా చూస్తే అతను కొత్త హీరో అనే ఫీలింగ్ ఎవరికీ రాదు.మీ సినిమాల్లో హీరోల పాత్ర చిత్రణ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. కొత్తవాడైన సాయిశ్రీనివాస్‌ను మీ శైలిలో ఆవిష్కరించడం కష్టమనిపించలేదా?

కొత్త హీరోలు భారీ డైలాగ్స్ చెబితే అంత అవసరమా అంటూ ప్రేక్షకులు విమర్శించే ప్రమాదముంది. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొని సాయిశ్రీనివాస్ క్యారెక్టరైజేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. తక్కువ సంభాషణలతోనే హీరోయిజమ్ ఎలివేట్ అయ్యేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దాను. కొత్తహీరో పట్ల ప్రేక్షకుల అంచనాలు ఎలా వుంటాయో వాటికి అనుగుణంగానే కథను తయారుచేసుకున్నాను.

అల్లుడు శీను అని టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?
సినిమాలో బ్రహ్మానందంను బురిడీ కొట్టించాలనే ఉద్దేశ్యంతో హీరో తన పేరును అల్లుడుశీను అని చెబుతాడు. ఈ సన్నివేశం నుంచి టైటిల్‌ను తీసుకున్నాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర హైలైట్‌గా వుంటుంది. ఇందులో హీరో మామగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు. మామకు జరిగిన అన్యాయాన్ని అల్లుడు ఎలా సరిదిద్దాడన్నదే చిత్ర ఇతివత్తం. చక్కటి వినోదం, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది.

కొత్తహీరో పక్కన సమంతాలాంటి స్టార్‌హీరోయిన్‌ను తీసుకోవడానికి కారణమేమిటి?
యువప్రేక్షకుల్లో సమంతాకు మంచి క్రేజ్ వుంది. ఆమెను చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే సమంతాను హీరోయిన్‌గా తీసుకున్నాం. కథాపరంగా కూడా ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యతవుంది.

వినాయక్ సినిమాలంటే భారీ బ్లాస్టింగ్‌లు, ఛేజింగ్‌లు వుంటాయి.

యాక్షన్‌పరంగా ఈ సినిమాలో వున్న ప్రత్యేకతలేమిటి?
ఇక్కడ మీకొక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పాలి. మొదట ఈ సినిమాలో బ్లాస్టింగ్, ఛేజింగ్‌లాంటి యాక్షన్ ఘట్టాలు వద్దనుకున్నాం. ఒకరోజు షూటింగ్ నిమిత్తం యూనిట్ అంతా విదేశాలకు వెళ్తున్నాం. ఎయిర్‌పోర్ట్‌లో నన్ను చూసిన ఓ ఉన్నతాధికారి దూరం నుంచే ఈ సినిమాలో కూడా బండ్లను పేల్చుతున్నారా? పేల్చండి…లేకపోతే మేము డిసెప్పాయింట్ అవుతాం అన్నారు. ఈ సంఘటనతో సినిమా ైక్లెమాక్స్‌లో కొన్ని బ్లాస్టింగ్ సీన్స్‌ను జతచేశాం.

ఈ చిత్రానికి బడ్జెట్ బాగా అయిందని అంటున్నారు?
ఇమేజ్ వున్న హీరోలయితే బడ్జెట్ విషయంలో మనకు కొన్ని అంచనాలుంటాయి. పెట్టిన బడ్జెట్‌కు తిరిగి ఎంత రాబట్టుకోగలమో అనే లెక్కలుంటాయి. కొత్త హీరో సినిమాకు బడ్జెట్‌ను నిర్ణయించడం సరికాదు. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాకు ఖర్చుపెట్టాం.

సినిమాలో వున్న హైలైట్స్ ఏమిటి?
అత్యల్ప ఉష్ణోగ్రతల నడుమ జపాన్‌లో ఇంతవరకు ఎవరూ తీయని లొకేషన్‌లో కొన్ని సన్నివేశాలు తీశాం. విపరీతమైన చలిలో అక్కడ షూటింగ్ చేయడమే సాహసమనిపించింది. అలాగే అబుదాబిలోని ప్రపంచప్రఖ్యాత రిసార్ట్ ఆల్‌ఖజ్రాలో కొంతభాగం షూటింగ్ జరిపాం. ఆ లొకేషన్‌లో తీసిన సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. దేవీశ్రీప్రసాద్ స్వరపరచిన పాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి.
ఆది దిల్ సినిమాలతో ఎన్టీఆర్, నితిన్‌ల కెరీర్‌కు బ్రేక్‌నిచ్చారు? అల్లుడు శీను చిత్రంతో సాయిశ్రీనివాస్‌కు ఎలాంటి గుర్తింపు వస్తుందనుకుంటున్నారు?సాయిశ్రీనివాస్‌లో కష్టపడే తత్వముంది. అలాగే వత్తిపట్ల, పెద్దవారి పట్ల భయభక్తులున్నాయి. అతను హీరోగా తప్పకుండా రాణిస్తాడు. అల్లుడు శీనుతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సష్టించుకుంటాడనే నమ్మకముంది.

స్వతహాగా మీరు ఎలాంటి సినిమాల్ని ఇష్టపడతారు?
సినిమాకు ఓ మ్యాజిక్ వుంటుంది. తెరపై కనిపించేదంతా నటనే అని తెలిసినా పాత్రల భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు. వారితో కలిసి నవ్వుతారు..ఏడుస్తారు. సినిమా మొదలయిన అరగంటలోనే నటీనటుల ఇమేజ్‌ను మరచిపోయి ప్రేక్షకులు కథలో లీనమవ్వాలి. అలాంటి సినిమాల్ని నేను బాగా ఇష్టపడతాను. ఆ తరహా సినిమాలు చేయడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాను.
చిరంజీవి 150వ చిత్రానికి మీరు దర్శకత్వం వహించబోతున్నారని తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి?చిరంజీవిగారితో సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం కథ తయారుచేసే పనిలో వున్నాను. అయితే ఆయనకు నచ్చే కథ సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఆయన కూడా ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు.

వ్యక్తిగతంగా మీరు ఎలాంటి కథతో చిరంజీవిగారిని తెరపై చూడాలనుకుంటున్నారు?
సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతూ, ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్‌తో కూడిన కథ అయితే చిరంజీవిగారికి బాగుంటుందని అనుకుంటున్నాను.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts