'గ్రీన్ సిగ్నల్' ప్లాటినమ్ డిస్క్ విశేషాలు

0

Green Signal Platinum Disc Function (21)రేవంత్, రక్షిత, మానస్, మనాలి, అశుతోష్ నటీనటులుగా విజయ్ మద్దాల దర్శకత్వంలో ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై మారుతి సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘గ్రీన్ సిగ్రల్’. జె.బి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆడియో సక్సెస్ లో భాగంగా ఈ యూనిట్ ఈ రోజు (27.5.2014) ప్లాటినమ్ డిస్క్ వేడుక ను జరిపింది. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

డైరెక్టర్ మారుతి ప్లాటినమ్ డిస్క్ షీల్డ్ లను యూనిట్ సభ్యులకు అందజేసి, ఆడియో విజయం సాధించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

అనంతరం నిర్మాత రుద్రపాటి రమణరావు మాట్లాడుతూ – ”నిర్మాతగా నాకు ఇది తొలి సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. జె.బి చక్కటి పాటలిచ్చారు. పాటలు వినడానికే కాదు… విజువల్ గా కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమా ఆడియో హక్కుల కోసం మూడు కంపెనీలు వచ్చాయి. కానీ శ్రేయాస్ వారు పాటలు నచ్చి, ఫాన్సీ ఆఫర్ ఇచ్చి ఆడియో రైట్స్ ను తీసుకున్నారు. ఎక్కువ శాతం గోవాలో ఈ చిత్రం షూటింగ్ చేసాం. యూత్ కి ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామలీస్ కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఆడియోను ఆదిరించిన ప్రేక్షకులు సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ – ”నాలుగు జంటలపై తెరకెక్కిన చిత్రం ఇది. యువత మధ్య రిలేషన్స్ ఎలా ఉంటే సొసైటీకి మంచిదని ఈ సినిమాలో చూపించడం జరిగింది. మనం చేసే ప్రతి పనికి పాజిటివ్ గ్రీన్ సిగ్నల్ కావాలని ఈ సినిమాలో చూపించాము. పెద్దవాళ్లు ఈ సినిమా చూసేటప్పుడు తమ గతానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ ను గుర్తుకు తెచ్చకుంటారు. నీట్ సినిమా. జె.బి అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ యేడాది బెస్ట్ ఆడియోల్లో ‘గ్రీన్ సిగ్నల్’ ఆడియో కి కూడా స్థానం ఉంటుంది. ఆడియోను హిట్ చేసిన ప్రేక్షకులు, సినిమాని కూడా ఆదరించాలి.  మారుతిగారు పట్టిందల్లా బంగారమే. ఆయన ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా మంచి విజయం అందకుంటుందనే నమ్మకం ఉంది. సినిమా చాలా రిచ్ గా ఉంటుంది. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది” అని చెప్పారు.

సంగీత దర్శకుడు జె.బి మాట్లాడుతూ – ”ఈ ఆడియోను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన మారుతిగారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నాకు ఈ చిత్రం ఆడియో మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ టీమ్ తో వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్, మనాలి, మానస్, సాయి ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని, సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts