గోపాలుడితో ఆటాపాట!

0

priyamaniగత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన ప్రియమణికి తాజాగా బంపర్ ఆఫర్ లభించిందని తెలిసింది. అక్షయ్‌కుమార్, పరేష్‌రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ఓ మై గాడ్. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాల అనే పేరుతో డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, పవన్‌కల్యాణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

కిశోర్ పార్థాసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం కోసం ప్రియమణిని తీసుకున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్ మాతకలో గో గోవిందా… అంటూ సాగే ఈ పాటని ప్రభుదేవా, సొనాక్షీసిన్హాలపై చిత్రీకరించారు. ఇదే పాటని గోపాలా గోపాలలో పవన్‌కల్యాణ్, ప్రియమణిలపై చిత్రీకరించే అవకాశం వుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం ప్రియమణికి కెరీర్ పరంగా కొత్త ఉత్సాహాన్ని అందించే అవకాశముందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts