గురు"బ్రహ్మి"-గురుర్విష్ణు-గురుదేవో మహేశ్వర

0

downloadఅదేంటి…. గురు “బ్రహ్మ” అని కదా ఉండాలి… గురు “బ్రహ్మి” అని రాశారేమిటి అనుకుంటున్నారా? లేదు లేదు…సరిగ్గానే రాశాము. ఎందుకు-ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటే ఇది పూర్తిగా చదవండి. ఈరోజు 5. సెప్టెంబర్ ని టీచర్స్ డే గా జరుపుకుంటాం అని అందరికీ తెలిసిందే భారతదేశ అధ్యక్ష పీఠానికి గౌరవం తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణ ఒకరు. ఉపాధ్యాయుడిగా, రాజనీతిజ్ఞుడిగా, తాత్వికుడిగా పేరుగాంచిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితంలో ఎక్కువ భాగం ఉపాధ్యాయుడిగానే గడిచిపోయింది. ఉపాధ్య వృత్తికి గౌరవం తెచ్చిన ఆ మహానుభావుడి జన్మదినాన్ని ‘టీచర్స్ డే’ గా భారతదేశం యావత్తూ ఈరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అటువంటి పవిత్రమైన టీచింగ్ ప్రోఫిషన్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన “బ్రహ్మానందం” కూడ ఒక ఉపాధ్యాయుడే అన్న విషయం తెలిసిందే. ఈరోజు జరుగుతున్న ‘టీచర్స్ డే’ సందర్భంగా వివిధ రంగాలలో స్థిర పడ్డ బ్రహ్మనందం శిష్యులు బ్రహ్మి పై తెలియచేసిన అనేక ఆసక్తికరమైన విషయాలను ఈరోజు ఒక దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.బ్రహ్మీ తెలుగు లెక్చరర్ గా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలోని ఎస్.వి.ఎస్.ఎస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు కాలేజీలోని చాల క్లాస్ రూమ్స్ విద్యార్ధులు లేక ఖాళీగా ఉంటే బ్రహ్మనందం పాఠాలు చెప్పే క్లాసు రూమ్స్ మటుకు విద్యార్ధులతో కిక్కిరిసిపోయి పిన్ డ్రాప్ సైలెన్స్ తో విద్యార్ధులు బ్రహ్మి చెప్పే పాఠాలను వినేవారట. తెలుగు పాఠ్యపుస్తకాలాలోని పద్యాలను బ్రహ్మీ ఆనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలలా మిమిక్రీ చేసి పాడుతూ ఆ పద్యానికి బ్రహ్మానందం అర్ధాలు చెపుతూ ఉంటే విధ్యార్ధులు బ్రహ్మీ క్లాస్ అంటే తెగ ఇష్టపడేవారట.

దాదాపు 8 ఏళ్ళు లెక్చరర్ గా పనిచేసిన బ్రహ్మానందం తన విధ్యార్ధులకు తెలుగు ఛందస్సుకు సంబంధించిన సవర్ణదీర్ఘ సంధి, చంపకమాల, ఉత్పలమాలను కూడ అలనాటి సినిమా హీరోల డైలాగ్ మాడ్యులేషన్ ను అనుసరిస్తూ విధ్యార్ధులకు గుర్తు ఉండిపోయేలా చెప్పేవాడట బ్రహ్మానందం. ఆయన శిష్యులు అనేక మంది ప్రోఫిసర్లుగా, పోలీసు అధికార్లుగా, డాక్టర్లుగా, నేటి తెలుగు ఇరు రాష్ట్రాలలోను ఉన్నతాధికార్లుగా పనిచేస్తున్న బ్రహ్మనందం శిష్యుల భావాలను చదువుతూ ఉంటే తెలుగు సినిమా రంగంలోనే కాదు లెక్చరర్ గా కూడ బ్రహ్మానందం చేసిన ప్రయోగాలు నిజమైన గురు బ్రాహ్మిగా – బ్రహ్మానందాన్ని నిలబెట్టాయి అని అనిపించక మానదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts