గుప్పెడంత ప్రేమ టీజర్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్

0
Guppedantha Prema
ఐ వింక్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వినోద్ లింగాల రచనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చలన చిత్రం గుప్పెడంత ప్రేమ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి మంచి ప్రశంసలు  పొందింది. ఫస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం లో నూతన నటీనటులు సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య ముఖ్య తారాగణంగా పరిచయం అవుతున్నారు.
చిత్ర రచయిత మరియు దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడుతూ … ఫస్ట్ లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హద్దుకునే ఫీల్ గుడ్ మూవీ లా చితికరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో తొలి ప్రేమ మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఒక అందమైన ప్రేమ కథని గుప్పెడంత ప్రేమ చలన చిత్రం ద్వారా  ప్రేక్షకులకి అందిస్తున్నామని చెప్పారు. వినూత్న కథా కథనం, విసువల్ బ్యూటీ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్ఫుల్ లవ్ స్టోరీ అవుతుందని చెప్పారు. ఈ కథలోని పాత్రలలో ప్రస్తుత యువత తమని తాము చూసుకుంటారని, తమ స్వత్చమైన ఫీలింగ్స్ కి అద్దంలా ఉంటుందని చెప్పారు.
ఐ వింక్ ప్రొడక్షన్స్ సంస్థ సభ్యులు సుజిత్, పావని మాట్లాడుతూ లాస్ట్ షెడ్యూల్ శిల్లోంగ్, చిర్రపుంజి, మేఘాలయ మరుయు ఈశాన్య భారత దేశంలోని పలు కొత్త లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నామని చెప్పారు. అంతకు ముందు హైదరాబాద్, గుంటూరు, వరంగల్ లో షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు వినోద్ లింగాల దర్శకులు శ్రీకాంత్ అడ్డాల మరుయు దర్శక నిర్మాత మధుర శ్రీధర్ ల దర్శకత్వ శాఖలలో పని చేసారు. ఆ తరువాత ఈ ప్రేమ కథని ఎంచుకుని చాలా అందంగా యువతకి కనెక్ట్ అయ్యేలాగా తీర్చి దిద్దుతున్నారు. ఐ వింక్ ప్రొడక్షన్స్ సంస్థ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందని, త్వరలో ఆడియో లాంచ్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ చిత్రానికి నవనీత్ సుందర్ సంగీతాన్ని సమకూర్చగా, సంజయ్ లోక్నాథ్ ఛాయాగ్రహణం అందించారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ అందించగా, వనమాలి, శ్రీమణి లిరిక్స్ రాసారు. బసవ ఎడిటింగ్ చేస్తున్నారు. 
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
powered by RelatedPosts