గీతాంజలితో సైతాన్‌రాజ్ హంగామా!

0

Anjali (13)ప్రపంచంలో భూతాలు, ప్రేతాలు బెస్ట్. మిగిలినవన్ని వేస్ట్ అనుకొనే టైపు మనిషి సైతాన్‌రాజ్. కొరివి దెయ్యాలతో కబుర్లు, పిశాచాలతో పబ్బులు, క్లబ్బులు అంటూ తిరుగుతుంటాడు. అతని పేరు చెబితే దెయ్యాలు కూడా నిదురపోవు. అటువంటి సైతాన్‌రాజ్ ఓ అమ్మాయిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు కోన వెంకట్. ఆయన సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం గీతాంజలి.

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.వి.వి సత్యనారాయణ నిర్మాత. రాజ్‌కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో సైతాన్‌రాజ్‌గా బ్రహ్మానందం కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర తాలూకు గెటప్‌ను గురువారం హైదరాబాద్‌లో మాస్టర్ సుభాని (అలీ తనయుడు) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ కొందరు పుట్టిన తర్వాత నటులవుతారు.

మరికొందరు పుట్టుకతోనే నటులవుతారు. అంజలి రెండో కేటగిరికి చెందుతుంది. ఆమెలో మంచి నటి దాగుంది. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి హీరోగా మారడం ఆనందంగా వుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ అంజలిని దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్రకథను తయారుచేశాం. ఆమె అంగీకరించపోతే ఈ సినిమా తెరకెక్కేదికాదు.ఈ నెల 20న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. అంజలి మాట్లాడుతూ బ్రహ్మానందంతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని వుంది. సైతాన్‌రాజ్‌గా ఆయన పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలోశ్రీనివాసరెడ్డి, కృష్ణభగవాన్, అలీ, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts