గబ్బర్‌సింగ్-2లో కాజల్?

0

Actress Nisha Agarwal Wedding Photos, Kajal Sister Nisha Agarwal Marriage Photosతెలుగులో భారీ విజయాల్ని ఖాతాలో వేసుకొని అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపును సంపాదించుకుంది kajalపంజాబీ సుందరి కాజల్‌అగర్వాల్. తాజాగా ఆమె తెలుగులో మరో బంపర్‌ఆఫర్‌ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న గబ్బర్‌సింగ్-2లో కాజల్‌అగర్వాల్ కథానాయికగా ఖరారైనట్లు సమాచారం. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పవన్‌కల్యాణ్ సన్నిహిత మిత్రుడు శరత్‌మరార్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కొద్దినెలల క్రితమే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న గోవిందుడు అందరివాడేలే చిత్రంతో పాటు పూరిజగన్నాథ్-ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న ఓ చిత్రంలో కాజల్‌అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజా ఆఫర్‌తో ఆమె పవన్‌కల్యాణ్ సరసన తొలిసారిగా నటించబోతుండటం విశేషం. పవన్‌కల్యాణ్ సరసన నటించాలన్నది తన డ్రీమ్ అని చాలా సందర్భాల్లో చెప్పింది కాజల్‌అగర్వాల్. తాజా అవకాశంతో ఆమె కల సాకారమైందని సినీవర్గాలు అంటున్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts