"క్వీన్" ప్రేమలో పడ్డ కుర్రహీరో

0

Kangana_Ranaut_Photos“క్వీన్” అనగానే కనిపెట్టేసి ఉంటారు కంగణా రనౌత్అని కానీ, ఆ కుర్ర హీరో ఎవరు మరి అనే ఆలోచన మీ బుర్రల్లో తిరుగుతోంది కదూ? అమీర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగణా రనౌత్ ప్రేమలో పడ్డాడట. అయితే ఇది కేవలం తెర మీద మాత్రమే, నిజంగా కాదు. విషయం ఏమిటంటే, ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ జంటగా ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కబోతుంది. అదే ‘కట్టీబట్టి’. నికిల్ అద్వానీ దర్శకుడు. యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కంగనా స్పందిస్తూ ”స్త్రీ, పురుషుల మధ్య సంబంధం, పట్టణ దంపతుల జీవితాల్లో తలెత్తుతున్న సమస్యలు… ఇలాంటి విషయాల నేపథ్యంగా ఈ కథ సాగుతుంది.

ఈ నిర్మాణ సంస్థలో నేను నటించిన ‘ఫ్యాషన్’, ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి”అని చెప్పింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ మతిస్థిమితంలేని వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. ”ఈ సంస్థలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాను. యువతరం నటుల్లో కంగనా ఓ మంచి నటి”అని చెప్పాడు ఇమ్రాన్. దర్శకుడు మాట్లాడుతూ ”కంగనాతో పనిచేయాలని నాకు ఎప్పటినుంచో ఆశ. ఈ పాత్రలకు ఈ ఇద్దరూ వందశాతం సరిపోతారు”అని చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts