క్లైమాక్స్ షూటింగ్ లో నాకు ఇంకోపేరుంది

0

4f9f2764-9e68-409f-9a26-4c383b1a9863 copy

7ebf9c83-2546-4ab7-9994-20c131de136a copy

క్లైమాక్స్ షూటింగ్ లో నాకు ఇంకోపేరుంది

జి‌వి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘నాకు ఇంకో పేరుంది’. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ.. “యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. చిత్రీకరణ బాగా జరుగుతుంది. మేము అనుకుంటున్న దానికంటే సినిమా చాలా బాగా వస్తుంది. రజనీకాంత్ గారి ‘బాషా’లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం.  సినిమా పేరుకు యువత నుంచి మంచి స్పందన లభించింది. చిత్రంలో నా పేరు జాని. 1980లో ‘జాని’ పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
ఈ చిత్రానికి
సంగీతం : జి‌వి ప్రకాష్
కెమెరా : కృష్ణన్ వసంత్
ఎడిటర్ : రుబెన్
స్టంట్స్ : దిలీప్ సుబ్రాయన్
ఆర్ట్ : ఉమేశ్ జె కుమార్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్. ప్రేమ్
ప్రొడ్యూసర్ :  లైకా ప్రొడక్షన్
కథ, దర్శకత్వం : శ్యామ్ ఆంటోన్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts