క్యాన్సర్ వస్తుందేమోనని భయపడ్డాడట

0

Om Puri Actorసెలెబ్రిటీలు ఏం చేసినా అదొక న్యూస్ అయి కూర్చుంటుంది. ఇది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకీ విషయం ఏమిటంటే, బాలీవుడ్ విలక్షణ నటుడు ఓం పురి సిగరెట్లు కాల్చడం మానేశాడు అని ప్రస్తుతం బాలీవుడ్ లో అంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి, బాలీవుడ్ లో నటులకి దాదాపు ప్రతి ఒక్కరికీ పొగ త్రాగే అలవాటు ఉంది. ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో ఆ అలవాటు వల్ల అవస్థలు పడటం మనం చూశాం. తాజాగా ఓం పురి కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. అధికంగా స్మోక్ చేయడం మూలాన్,  నోట్లో వైట్ ప్యాచ్ రావడం, ముఖంలో కూడా కొంచెం తేడా కనిపించడంతో ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతా కేన్సర్ వచ్చిందేమోనని భయపడ్డారు. ఇటీవలే నోటికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స కూడా చేయించుకున్న ఓం పురి.. ఇక జన్మలో సిగరెట్లు ముట్టేది లేదంటూ వాటిని వదిలిపెట్టేశాడు.

నోట్లో వచ్చిన వైట్ ప్యాచ్ ఎంతకీ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరానని, దాంతో తనకు వెంటనే శస్త్రచికిత్స చేశారని ఓం పురి తెలిపాడు. అదృష్టవశాత్తు అది ఇంకా కేన్సర్ కారకంగా మారలేదని, అందువల్ల తన ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను సిగరెట్లు మానేయాల్సిందేనని గట్టిగా చెప్పారు.

ఇన్ని సంవత్సరాలుగా వాటిని ఏమాత్రం వదిలిపెట్టలేని తాను.. డాక్టర్లు చెప్పడంతో వెంటనే మరునిమిషం నుంచే సిగరెట్లు మానేసినట్లు ఓంపురి చెప్పాడు. మన ఆరోగ్యం కంటే ఏమీ ముఖ్యమైనది కాదని, ఆ విషయం తాను ఆస్పత్రిలో చేరాకే తెలిసిందని అన్నాడు. ఇక సినిమాల గురించి చెబుతూ.. భారతీయ సినిమాల్లో తనకు ఇక అవకాశాలు ఏమీ కనిపించడం లేదని, ఇన్నాళ్ల పాటు అన్ని రకాల పాత్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో నిరుద్యోగిగా కూర్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అప్పుడప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి ఒకటీ అరా ఆఫర్లు వస్తున్నాయని, వాటివల్లే కాస్త ఊరటగా ఉంటోందని తెలిపాడు.

ఓం పురి గతంలో రేవతి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా “అంకురం” సినిమాలో అద్భుత నటనని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. అలాంటి ప్రతిభ గల నటుడికి ఇటు తెలుగులో, అటు హిందీలో ఎక్కువగా అవకాశాలు రాకపోవడం బాధాకరమే అని చెప్పుకోవాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts