"కొబ్బరిమట్ట"శాటిలైట్ రైట్స్ కి భారీ డిమాండ్

0

sampoornesh-babuఏ హీరొకైనా మొదటి సినిమా విడుదల కాకముందే స్టార్ స్టేటస్ సొంతం కావడం మనం ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా…. ఎక్కడైనా చూశామా? లేదు కదూ? కానీ ఒకడున్నాడు. అతని విషయంలో ఆ అద్భుతం జరిగింది. ఆగ్రా దర్శకుడు రాజమౌళి చేసిన ఒకే ఒక ట్వీట్ వల్ల అతనికి వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు మరి. అతికొద్ది కాలంలోనే లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న అతను ఎవరో కాదు…

” హృదయకాలేయం” సినిమాతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంపూర్నెష్ బాబు . తను చేసిన మొదటి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా శాటిలైట్ రైట్స్ పరంగా కూడా మంచి రేటు పలికింది. ఇప్పుడు ఇదే క్రేజ్, అదే డిమాండ్ సంపూర్నేష్ బాబు నటిస్తున్న ‘కొబ్బరి మట్ట’ కి కూడా నెలకొంది.

సంపూర్నేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ లో పెదరాయుడు, పాపారాయుడు మరియు ఆండ్రాయిడ్ అనే మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో సంపూ సరసన ఏడుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం ప్రస్తుతం తెలుగు టీవీ చానల్స్ మధ్య శాటిలైట్ రైట్స్ కోసం గట్టి పోటీ జరుగుతోంది. మరి చివరికి ఏ చానల్ దక్కించుకుంటుందో అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే సంపూర్నేష్ బాబుపై ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయడం మొదలు పెట్టారు. ఆ పాటని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రొనాల్డ్ డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న ఈ మూవీకి కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.

మరి ఈ “కొబ్బరిమట్ట” ఎనిన్ కోట్లు కురిపిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే మరి …!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts