కొత్త సినిమా కష్టాలు

0

sonam-kapoorబాలీవుడ్ భామ సోనమ్ కపూర్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి. త్వరలో ప్రారంభంకానున్న ఓ కొత్త చిత్రంకోసం ఆమె బాగానే శ్రమిస్తోంది. ఈ సినిమాకు తగ్గట్లుగా తన శరీరాకతిని మార్చుకునే పనిలో వున్న ఆమె రోజులో ఎక్కువ సమయాన్ని వ్యాయామాలు పేరిట జిమ్‌లోనే గడపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన ఆహారపదార్థాలకు పూర్తిగా దూరంగా వుంటున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా సురాజ్ బర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయే. ఈ చిత్రంలో సోనమ్‌కపూర్ కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ వంటి అగ్రకథానాయకుడితో తొలిసారి జోడీ కట్టిన ఈ సుందరి ఈ సినిమాపై భారీ ఆశలనే పెట్టుకుంది. కొంతకాలంగా బాక్సాఫీస్ దగ్గర వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఆమె ఈ సినిమాతో విజయాల బాట పట్టాలనే కోరికతో వుంది.

ఈ సినిమా కోసం తన బరువును దాదాపుగా ఎనిమిది కిలోల మేర తగ్గించుకోవాలనే ఆలోచనలో వున్న సోనమ్ ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. కొంతకాలంగా కఠిన వ్యాయామాలతో జిమ్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్లు తెలిసింది. ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటిస్తోన్న ఆమె తనకు చాలా ఇష్టమైన చాకోలెట్స్‌కు దూరంగా వుంటోందట. జీవితంలో ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాలి. మనసుకు నచ్చిన కథ కాబట్టి కష్టాల్ని ఎదుర్కోవాలి. సల్మాన్‌తో నటిస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పింది సోనమ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts