కుర్రాడు… రఫ్

0

Rough Movie New Stills (1)ఆది, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రఫ్’. శ్రీహరి ముఖ్య భూమిక పోషించారు. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యమ్.అభిలాష్ నిర్మాత. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ”రఫ్ అండ్ టఫ్‌గా కనిపించే కుర్రాడి కథ ఇది. తనకి ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడన్నది తెరపైనే చూడాలి. ఆదిని తెరపై కొత్త కోణంలో చూపిస్తున్నాం” అన్నారు. ”ఇంటిల్లిపాదినీ అలరించే కథతో ఈ చిత్రం రూపొందింది. ఆది నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది”అన్నారు నిర్మాత. చిత్రంలో తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, పవిత్రా లోకేష్ తదితరులు నటించారు. చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, పాటలు: భాస్కరభట్ల, కళ: సీతారామాంజనేయులు, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్ కుమార్, అరుణ్‌కుమార్, సంగీతం: మణిశర్మ

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts