"కిక్-2"లో "కిక్-2"లో నందమూరి హీరో?

0

Nandamuri-Kalyan-Ram-for-Kiటాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగా షికార్లు చేస్తున్న వార్త ఏదైనా ఉందా అంటే అది రవితేజ చేస్తున్న “కిక్-2” లో జూ: ఎన్టీఆర్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు అన్న వార్తనే చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ పక్కకి పెట్టేసాక, ఒంటరివాడైపోతాడేమో అనుకున్న ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ, అన్నయ్య కళ్యాన్ రామ్ కి దగ్గర అవ్వడం ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త ఊరటనిచ్చింది. . ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ నిర్మాతగా వక్కంతం వంశీ దర్శకత్వలో రానున్న ఓ చిత్రానికి ఎన్టీయార్ హీరోగా చేయడానికి అంగీకరించిన విషయం విదితమే.

విశేషం ఏమిటంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా ప్రారంభం కానున్న కిక్ 2లో కూడా అతిథి పాత్రలో మెరవడానికి ఎన్టీయార్ ఒప్పుకున్నాడని సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రమేయంతో నిర్మాత కళ్యాణ్ రామ్ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి తారక్ కోసం ఈ పాత్రను డిజైన్ చేసారని తెలుస్తోంది. మరి రవితేజ, తారక్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ ఎనర్జీనే వేరు అసలు..

అభిమానులకి ఇక పండగే అని వేరే చెప్పక్కర్లేదు. అధికారికంగా కూడా ప్రకటన వచ్చేస్తే, “కిక్-2” సినిమా మీద అంచనాలు మామూలుగా పెరగవు. అయితే, దర్శకుడు సురేందర్ రెడ్డి కానీ, హీరో రవితేజ కానీ ఈ విషయమై ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు …. త్వరలో ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి మరి…

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts