కింగ్‌ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ గుంటూరు జిల్లా షేర్‌ 4 కోట్ల 15 లక్షలు

0
కింగ్‌ నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ గుంటూరు జిల్లా షేర్‌ 4 కోట్ల 15 లక్షలు
2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకొని 53 కోట్లకు పైగా షేర్‌ సాధించి బాక్సాఫీస్‌ని షేక్‌చేసిన కింగ్‌ నాగార్జున లేటెస్ట్‌ బంపర్‌ హిట్‌ ‘సోగ్గాడే చిన్నినాయనా’ 110 కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుని శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. కాగా, ఈ చిత్రం గుంటూరు జిల్లాలో 7 వారాలకు 4 కోట్ల 15 లక్షల షేర్‌ కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.
ఈ సందర్భంగా పంపిణీదారుడు పూరిమెట్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”నాగార్జునగారి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం గుంటూరు జిల్లాలో 15 సెంటర్స్‌లో 40 రోజులు పూర్తి చేసుకొని 100 రోజులకు పరుగులు తీస్తోంది. కేవలం 7 వారాల్లోనే ఈ చిత్రం 4 కోట్ల 15 లక్షల షేర్‌ కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇంత పెద్ద హిట్‌ సినిమాను పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి, ఈ చిత్రానికి అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు, అభిమానులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము” అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts