కారుప్రమాదం నుండి బయటపడ్డ అందాల భామ

0

hamsanandiniప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ హాట్ ఐటెం గాళ్ ఎవరు అంటే మొట్టమొదట వినిపించే పేరు “హంసానందిని”. తాజాగా ఈ అమ్మడు ఒక కారు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది అని తెలిసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌ వైపు కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా మునిరంగస్వామి ఆలయ సమీపంలోకి రాగానే ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతోంది. అయితే చిన్నగాయాలతో హంసనందిని బయటపడింది అని అంటున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు ఆమెతోపాటు మరోముగ్గురు వ్యక్తులు ఆమెతో ప్రయాణిస్తున్నారట. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడవల్లే స్వల్పగాయాలతో బయటపడ్డామని వారు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఆమెకు సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆమె యోగ క్షేమాలు కనుక్కుంటునట్లుగా వినికిడి. గత సంవత్సరం ‘అత్తారింటికి దారేది’, ఈ సంవత్సరం ‘లెజెండ్’ సినిమాల సూపర్ హిట్ ఐటమ్ భామగా పేరుగాంచిన ఈ మిర్చి బ్యూటీకి అదృష్టం కలిసి రావడంతో పెద్ద ప్రమాదం నుండి గట్టెక్కినట్లు భావించాలి.

జాగ్రత్త పిల్లోయ్, ఎటూ చేతినిండా బోలెడు సంపాదిస్తున్నావ్ కదా, వీలైనంతగా రోడ్డు ప్రయాణాలని తగ్గించుకో.. అసలే నిన్ను నమ్ముకుని కొన్ని లక్షలమంది తమ కళ్లని సినిమా తెరలకి అతికించుకుని చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు మళ్లీ ఏ పాటలో మెరుస్తావో అని..

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts