కమెడియన్ హీరోగా వర్మ సినిమా?

0

RGVచేతిలో మంత్రదండం ఉన్న ప్రతి మనిషీ ఒక దేవుడే. ఎందుకంటే అప్పుడు అతను ఏం చేసినా చెల్లుతుంది. అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సినిమాల విషయానికి వస్తే, దర్శకత్వం అనే మంత్రదండం ఉన్న వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా తనకి ఇష్టం వచ్చినట్టు సినిమాలు చేస్తుంటాడు. జనం మీదకి వదులుతూంటాడు. గత కొన్నాళ్లుగా సరికొత్త టెక్నాలజీలతో వర్మ “ఐస్క్రీమ్” సీరీస్ లో సినిమా చేస్తూ ప్రేక్షకుల మీద దండయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వర్మ హాస్య నటుడు ధనరాజ్ హేరోగా “ఐస్క్రీమ్ 1 1/2 ” అనే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈటీవిలో ప్రసారమయ్యే “జబర్దస్త్” అనే కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్ ధన రాజ్ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ కి ‘ఐస్ క్రీమ్ 1 1/2′ అనే టైటిల్ ని పెట్టాడు. ఐస్ క్రీమ్ 2 రిలీజ్ అయిన తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది. ఐస్ క్రీమ్ సినిమా నిర్మించే తుమ్మలపల్లి సత్యనారాయణ ఈ షార్ట్ ఫిల్మ్ ని కూడా నిర్మించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లాంటివి ఫ్యూచర్ లో మరిన్ని రావాలని రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు నచ్చని వారి కోసం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ఇవి తీసామని వర్మ అన్నాడు.

అబ్బో…..ఎంత దయో సారుకి ప్రేక్షకుల మీద……

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts