కన్నడలో "మనం" రీమేక్

0

kannada-manamఇటీవలే తెలుగులో విడుదలయిన అక్కినేని కుటుంబ సినిమా ” మనం” ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూశాం. అటు బాలీవుడ్ లో, ఇటు కోలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా, “మనం”ని కన్నడలో కూడా రీమేక్ చేసే ప్రయత్నం నటుడు ,డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కుటుంబం చేస్తోంది అని వినికిడి.

అక్కినేని కుటుంబం లాగే, సాయుకుమార్ కుటుంబం కూడా అరుదైన నేపధ్యాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ నటులుగా మాత్రమే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. సాయికుమార్ తన విలక్షమైన నటన, డైలాగ్ డెలివరీతో ఎన్నో విభిన్న పాత్రల్లో వెండితెరపై మెరిశారు. తాత, తండ్రి బాటలోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు సాయుకుమార్ కుమారుడు ఆది.

దీంతో మూడు తరాల సినీ వారసత్వాన్ని వెండి తెరపై మెరిపించిన ‘మనం’ సినిమా కథ తమ కుటుంబానికి సైతం సరిగ్గా సరిపోతుందని సాయికుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా కన్నడ రీమేక్ రైట్స్ పొందేందుకు సాయికుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే మూడు తరాల సినీ వారసత్వాన్ని పొందిన మరో కుటుంబాన్ని తెరపై చూసే అవకాశం శాండల్‌వుడ్ ప్రేక్షకులకు కలగడంతో పాటు మూడు తరాల సినీనటులను కలిగిన అరుదైన కుటుంబంగా కూడా సాయికుమార్ కుటుంబానికి గౌరవం లభించనుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts