కత్రీనాని కత్తిరించేసాడా?

0

Katrina_Ranbir_imageచూడబోతే బాలీవుడ్ లో మరో దుమారం లేచేట్టు ఉంది. ఎందుకని అంటారా? గత కొంతకాలంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్న బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ మరియు సెక్సీ కత్రీనా ల మధ్య బంధం చెడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడా అనుమానం ఎందుకొచ్చింది అంటారా?ఐతే మీరే చదవండి.

త్వరలో పెళ్లి కూడా చేసుకోబొతున్నారు…. కలిసి ఉండటానికి ఒక కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నారు అనే వార్తలు ఇటీవలే మనం చూశాం. అలాంటిది ఉన్నట్టుండి ఈ పుకార్లేమిటి? అనేలా చేసింది ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తాజా ట్వీట్. విషయం ఏమిటంటే,
త్వరలో కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లో అయాన్ కుఖర్జీ దర్శకత్వంలో రణబీర్ ఒక సినిమా చేయనున్నాడు. ఇందులో కథానాయికగా తన ప్రేయసి కత్రీనా కైఫ్ ని ఎంపిక చేసుకున్నాడు రణబీర్. ఈ ముచ్చట గత ఏడాదే జరిగింది. ఐతే,ఇప్పుడు సినిమా ప్రారంభం కాబోతున్న సమయంలో ఆలియా భట్ కి రణబీర్ అవకాశం ఇచ్చాడు. అదే ప్రస్తుతం బాలీవుడ్ లో లేనిపోని అనుమానాలని రేకెత్తిస్తోంది.

ఈ ఆఫర్ ని రణ్ భీర్ కపూర్ స్వయంగా అలియాభట్ కి ఇచ్చాడు అని కరణ్ జోహార్ ట్వీట్ చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది. కత్రినాకైఫ్ ని రణ్ బీర్ కపూర్ దూరం పెట్టడంలో ఉన్న కారణం ఏంటో మీడియాకి అర్ధం అయింది. గత కొంత కాలంగా రణ్ భీర్ కపూర్, అలియా భట్ లు డేటింగ్ లో ఉన్నారని, అందుకే అలియా భట్ కి ఈ ఆఫర్ వరించిందని బిటౌన్ మీడియా కొక్కోరొక్కో అని కూస్తోంది. ఇంతకీ ఏం జరిగి ఉంటుందంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts