ఓ మధ్య తరగతి కుటుంబం

0

venkatesh-drishyam-first-look-photosఓ మధ్య తరగతి కుటుంబం. ఆ ఇంట్లోంచి ఇద్దరు అమ్మాయిలు రోజూ కళాశాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో వీరిని మధ్యలో అటకాయించి కొందరు యువకులు ఇబ్బంది పెడుతుంటారు. ఒకానొక సందర్భంలో దాడులకు దిగడానికీ సిద్ధమవుతారు. ఈ సమయంలో ఆ అమ్మాయిలు ఏం చేశారు.. వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనే అంశం నేపథ్యంలో వెంకటేష్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మీనా కథానాయిక. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యమ్’కిది రీమేక్. ఇందులో మోహన్‌లాల్ పోషించిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ”మానవ సంబంధాలు, బంధాలు, ఆత్మీయతలు, వినోదం మేళవింపుతో వస్తున్న చిత్రమిది. దర్శకురాలు సినిమాను ఆద్యంతం ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. వెంకటేష్, మీనా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి” అంటోంది చిత్రబృందం. చిత్రంలో నదియ, కృష్ణచైతన్య, బేబీ ఎస్తర్, కృతిక, కళాభవన్ షాజన్ తదితరులు నటిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts