'ఒక లైలా కోసం' తర్వాత…

0

Naga Chaithanya  (2)‘మనం’లో రాధా మోహన్‌గా, నాగార్జునగా రెండు విభిన్న పాత్రలతో అలరించారు నాగచైతన్య. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘స్వామి రా రా’ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్ నాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. నాగచైతన్య మాట్లాడుతూ ”స్వామి రా రా’ నాకెంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. ప్రస్తుతం నేను చేస్తున్న ‘ఒక లైలా కోసం’ తర్వాత ఈ సినిమా మొదలవుతుంది” అన్నారు. ”అన్ని వర్గాలను అలరిస్తూ నా తరహాలో సాగే సినిమా ఇది. నాగచైతన్య పాత్ర కొత్తగా ఉంటుంది” అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ”సుధీర్‌వర్మ చెప్పిన కథ చాలా బాగుంది. నాగచైతన్యను కొత్త తరహాలో చూపించే చిత్రమిది. త్వరలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామ”న్నారు. ఈ చిత్రానికి కళ: నారాయణరెడ్డి, సంగీతం: సన్నీ ఎం.ఆర్, ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, సమర్పణ: భోగవల్లి బాపినీడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts