ఒక్క రూపాయి అడ్వాన్స్‌గా ఇవ్వండి

0

Aవినడానికి కూసింత వింతగా ఉన్నా, నిజంగానే ఈ పాప ఒక సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ అక్షరాలా “రూపాయి” మాత్రమే. జస్ట్ వన్ రుపీ. ఇంతకీ అంతటి మంచి హీరోయిన్ ఎవరూ ఆన్ ఆలోసిస్తున్నారా…అదేనండి, అనన్య . “జర్నీ” సినిమాలో శర్వానంద్ ని బస్టాపు దాగా వచ్చి దిగబెట్టండి అని వెంటపడుతుంది కదా…గుర్తొచ్చిందా?

అనన్యకు తన చిత్రంలో నటించినందుకు దర్శకుడు బాల శ్రీరాం ఒక రూపాయి మాత్రం అడ్వాన్సుగా ఇచ్చారట. దర్శకుడు ఎ.వెంకటేష్ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు బాల శ్రీరాం. ‘ఇరవుం పగలుం వరుం’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. ఇందులో మహేష్, అనన్య జంటగా నటించారు. అనన్యతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమె వెంటబడిన సంఘటన గురించి దర్శకుడు మాట్లాడుతూ, అనన్యను ఈ చిత్రంలో ఒప్పందం చేసుకునేందుకు అనేక సార్లు ఆమెను కలిసి కథ చెప్పేందుకు ప్రయత్నించానన్నారు. చెన్నైలో కలవగా కేరళకు వచ్చి కథ చెప్పమని చెప్పి హఠాత్తుగా బయలుదేరి వెళ్లారన్నారు. ఆమె ఇల్లు వెతికి పట్టుకుని వెళ్లగా కథ వినేందుకు సమ్మతించారన్నారు.

ఈ సందర్శంగా నటి అనన్య మాట్లాడుతూ ఇంతవరకు భారీ బ్యానర్, ఇదివరకే చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులతోపాటు పనిచేశానన్నారు. మీరు కొత్త దర్శకులు కావడంతో కథ వినేందుకు సంశయించానని తెలుపుతూ కథ వినిపించమన్నారు. ఈ కథ చెప్పడంతోనే నచ్చడంతో ఒక్క రూపాయి అడ్వాన్స్‌గా ఇవ్వండి, ఈ చిత్రాన్ని మీరు ఎప్పుడు తీసినా తాను ఖచ్చితంగా నటిస్తానన్నారు. ఆ విధంగా ఒక రూపాయి అడ్వాన్సు తీసుకున్నారని, తర్వాత పారితోషికాన్ని తగ్గించుకుని నటించారన్నారు. ఈ చిత్రం పూర్తికావచ్చిందని, ఒక వివాదం కారణంగా కోర్టులో చిత్రానికి స్టే విధించబడిందన్నారు. ప్రస్తుతం ఈ స్టే తొలగిపోయిందని, 20వ తేదీ చిత్రం విడుదల కానుందన్నారు. బాలసుబ్రమణియం పెరియసామి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్. తనిగైవేలు విడుదలచేయనున్నట్లు తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts