ఐస్ క్రీమ్ గీతం!

0

Ice Cream Movie New Stills (11)నవదీప్, తేజస్విని జంటగా రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న థ్రిల్లర్ ఐస్ క్రీమ్. కమింగ్ టు బర్న్ యు అనేది ఉపశీర్షిక. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న సినిమాలో ఒకే ఒక్క పాట వుంది. ఆ పాటని ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నవదీప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ శివ సినిమాతో స్టడీకామ్‌ని పరిచయం చేశాం.

ఈ సినిమా ద్వారా ఫ్లోకేమ్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నీలజీతో రూపొందిన ఐస్ క్రీమ్ నా కెరీర్‌లో ఖచ్చితంగా ఓ వినూత్నమైన సినిమాగా నిలుస్తుంది అన్నారు. రిలీజ్‌కు ముందే మా చిత్రానికి ప్రాఫిట్ లభించింది. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని రామసత్యనారాయణ తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తొలిసారి నటించడం ఆనందంగా వుందని నవదీప్ తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది అని తేజస్విని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంపిణీదారులకు రామ్‌గోపాల్‌వర్మ జ్ఞాపికల్ని అందజేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts