"ఐస్క్రీమ్"రుచి మరిగిన వర్మ

0

Ice Cream 2 (6)సినిమా సినిమాకి ఒక సంచలనాన్ని రేపుతున్న వర్మ, సినిమా మేకింగ్ విషయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. కొత్తగా ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీతో కేవలం లక్షన్నర రూపాయలతో తెలుగు ప్రేక్షకులకి ఐస్క్రీమ్ రుచి చూపించిన రామ్‌గోపాల్ వర్మ,ప్రస్తుతం “ఐస్క్రీమ్” రెండవ భాగాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం తాలూకు ప్రసార చిత్రాలు నిన్న విడుదలయ్యాయి.

మామూలుగా ఫస్ట్ లుక్ అంటే ఎవరన్నా ఒకటో రెండో స్టిల్స్ విడుదల చేస్తారు కానీ, వర్మ ఏకంగా ఇరవై ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, సిద్ధు, ధన్‌రాజ్, నవీనా, శాలిని, గాయత్రి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత.

“ఐస్క్రీమ్-2” గురించి ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం.దానికి ఓ నాలుగు రోజుల ముందు ‘ఐస్‌క్రీమ్-3’ ప్రారంభిస్తాం. ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపాడు వర్మ.
‘‘నిర్మాతగా నేలపై ఉన్న నన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు వర్మ. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారని, తాను మాత్రం వర్మ సిద్ధాంతాన్ని పాటిస్తానని, టేకింగ్ పరంగా ‘ఐస్‌క్రీమ్-2’ ఓ అద్భుతమని జేడీ చక్రవర్తి చెప్పారు.

ఇంతకీ వర్మ ఈ “ఐస్క్రీమ్” రుచి ఎందుకు మరిగినట్టు? మరీ నెలకో “ఐస్క్రీమ్” విడుదల చేయడం ఏందయ్యా ?Ice Cream 2 (6)

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts