ఐదు వందలతో నా జీవితం మొదలైంది

0

yemagolaతనపై తనకి ఆత్మవిశ్వాసం, తన పనితనం మీద తనకి నమ్మకం ఉన్న ఏ మనిషైనా జీవితంలో ఉన్నత శిఖరాలని అందుకుంటాడు అనేదానికి డా : కేవీ సతీష్ నిలువెత్తు నిదర్శనం. కుటుంబ కాథాచిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందిస్తున్న “యమలీల – 2 ” చిత్రం ద్వారా ఆయన హీరోగా తెలుగు తెరకి పరిచయం అవుతున్నారు.

ఈరోజు తన జన్మదిన సందర్భంగా సతీష్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అయిదువందల రూపాయల పాకెట్‌మనీతో వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్లాను. కష్టాల్ని కూడా ఇష్టంగా స్వీకరించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాను. భవిష్యత్తులో సినీ రంగంలో కూడా రాణిస్తాను’’ అని నమ్మకాన్ని వెలిబుచ్చారు.

‘‘ఎప్పటికైనా నా సొంత డబ్బుతో సినిమా తీసి, హీరో కావాలనేది నా లక్ష్యం. కుటుంబ కథాచిత్రాలు తీయడంలో మంచి నేర్పు ఉన్న కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా. ఆయన ఇప్పుడు కుదరదన్నా, కన్విన్స్ చేశాను. ఆయన మూడు, నాలుగు కథలు చెబితే, నాకు ‘యమలీల 2’ నచ్చింది. ఇందులో యమధర్మరాజుగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం అయితేనే బాగుంటుందని కృష్ణారెడ్డి అన్నారు. లక్కీగా వీళ్లు కూడా ఒప్పుకోవడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. అందరి సహకారంవల్ల బాగా నటించగలుగుతున్నా. ఎడిటర్ గౌతంరాజుగారైతే ‘పది సినిమాల అనుభవం ఉన్నవాడిలా చేశావ్’ అని ప్రశంసించారు. మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. ఇకనుంచి ప్రతి ఏడాదీ నేను హీరోగా మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుంది’’ అని చెప్పారు.

కర్నాటకలో నేను స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామని, కేన్సర్ రోగులకు సహాయం చేస్తున్నామని, హెచ్‌ఐవి సోకిన పిల్లల కోసం అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సతీష్ తెలిపారు. తన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగువారి కోసం కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నదే తన ఆశయం అని ఆయన పేర్కొన్నారు.

మనసుంటే మార్గం ఉంటుంది అని సతీష్ ని చూస్తే అర్ధమవుతుంది. ఆయన కలలన్నీ నిజమావ్వాలని, ఆయన తన సేవాతత్పరతని తెలుగు నాట కూడా చాటాలని మనస్ఫూర్తిగ కోరుకుందాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్క...
Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
powered by RelatedPosts